Abn logo
Jun 6 2020 @ 15:07PM

రామానాయుడు సేవలను గుర్తుచేసుకున్న చంద్రబాబు

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్ రామానాయుడు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. దేశంలోని 13 భాషలలో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన నిర్మాత రామానాయుడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులుగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తాను సినీరంగంలో సంపాదించిన డబ్బును తిరిగి ఆ రంగ అభివృద్ధికే ఖర్చుచేసి ఎంతో మందికి ఉపాధినిచ్చారన్నారు. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రామానాయుడు జయంతి సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.   


Advertisement
Advertisement
Advertisement