Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

గుంటూరు: ఏపీలో కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిని వదిలి ప్రతిపక్షాన్ని వేధించడమేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగ ఓటర్లను అడ్డుకుంటే అరెస్ట్‌లతో వేధిస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ నేతలను వదిలేసి, టీడీపీ కేడర్‌ను పోలీసులు బెదిరించడం అప్రజాస్వామికమని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడం నేరమా? అని చంద్రబాబు అన్నారు. నెల్లూరులో టీడీపీ నేత శ్రీనివాసులును మంత్రి అనిల్‌ వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ వేధింపులతోనే శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, శ్రీనివాసులుకు ఎలాంటి ప్రాణహాని జరిగినా మంత్రే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు.. న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement