టీడీపీ చలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-12-04T06:17:48+05:30 IST

నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ అబ్దుల్‌ సలాం న్యాయ పోరాట సమితి నేతృత్వంలో గురు వారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీ సులు అడ్డుకున్నారు.

టీడీపీ చలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు
టీడీపీ నేతల హౌస్‌ అరెస్టు

విద్యాధరపురం, డిసెంబరు 3 : నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ అబ్దుల్‌ సలాం న్యాయ పోరాట సమితి నేతృత్వంలో గురు వారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీ సులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేయగా, మరికొందరిని హౌస్‌ అరెస్టులు చేశారు. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.నాగుల్‌మీరా ఈనెల 2న విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు బుధవారం రాత్రి నుంచే నాగు ల్‌మీరా, వించిపేటలో ఉంటున్న ఎండి ఫతావు ల్లాహ్‌, నగరంలో ఇతర ప్రాంతాల్లోని టీడీపీ ముస్లిం మైనార్టీ నేత ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాధరపురం కామకోటినగర్‌లో స్థానిక 39వ డివిజన్‌ అధ్యక్షుడు కె.శివశర్మను హౌస్‌ అరెస్టు చేశారు. భవానీపురం రైతు బజార్‌ రోడ్డులో ఉంటు న్న 40వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు పి.వి.చినసుబ్బ య్యను ఆయన ఇంట్లో 40, 41, 42 డివిజన్‌ల టీడీపీ నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు. వించిపేటలో హౌస్‌ అరెస్టు చేసిన ఎండి ఫతావుల్లాహ్‌ను కొత్తపే ట, పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి అక్కడ నుంచి భవానీపురం పీఎస్‌కు అక్కడి నుంచి ఇబ్రహీంప ట్నం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. 

వన్‌టౌన్‌ నుంచి ర్యాలీ : వన్‌టౌన్‌ కొత్తపేట కోమల సెంటర్‌ నుంచి 52, 53 డివిజన్ల టీడీపీ అధ్య క్షులు మరుపిళ్ల తిరుమలేశ్వరరావు, ఈదీల సాంబ ఆధ్వర్యంలో కేశినేని భవన్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వ హించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

టీడీపీ నేత నాగుల్‌ మీరా హౌస్‌ అరెస్ట్‌

పాయకాపురం : నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరుతూ తెలుగుదేశం పార్టీ, ప్రజా సంఘాలు గురువారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. చుట్టుగుంటలోని టీడీ పీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. నాగుల్‌మీరా ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీని పై మీరా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గృహ నిర్బంధంలో మాజీ కార్పొరేటర్‌

భవానీపురం : సలాం కేసును సీబీఐకు అప్పగిం చాలని అసెంబ్లీ ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపు నిచ్చిన నేపథ్యంలో భవానీపురంలో మాజీ కార్పొరేటర్‌, 41 కార్పొరేటర్‌ అభ్యర్థి  పత్తి నాగేశ్వరరావును గురు వారం పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. 

రైతునేత ఆళ్ల గృహ నిర్బంధం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : సలాం కుటుంబా నికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని టీడీపీ సీనియర్‌ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నా రు. రంగన్నగూడెంలోని ఆయన స్వగృహంలో పోలీ సులు గురువారం నోటీసు ఇచ్చి గృహనిర్బంధం చేశా రు. ఎస్సై చంటిబాబు ఆధ్వర్యంలోని సిబ్బంది జాతీ య రహదారిపై వాహనాలను ఆపి తనిఖీ చేశారు.


Updated Date - 2020-12-04T06:17:48+05:30 IST