ప్రజల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-24T01:08:00+05:30 IST

ప్రజల మనోభావాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నంద్యాల పార్లమెంట్

ప్రజల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారు: చంద్రబాబు

అమరావతి: ప్రజల మనోభావాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా ప్రజల నమ్మకాలను, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. టీటీడీ డిక్లరేషన్‌పై వైసీపీ రాద్ధాంతం చేసింది. హైందవ సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోని చిన్నా పెద్దా దేవాలయాలతో పాటు శ్రీశైలం సహా తిరుపతి వరకు దేవాలయాల ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. భార్య ఉన్నపుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టం. జగన్మోహన్ రెడ్డికి ఏసు క్రీస్తు అంటే నమ్మకం ఉంది. కాబట్టి ఇంటిపై శిలువ చిహ్నం వేసుకున్నారు. నేను వెంకటేశ్వరస్వామిని నమ్ముతా. ముస్లింలు అంతా అల్లాను నమ్ముతారు. అది వారి వారి నమ్మకం. దాన్ని గౌరవించాలే తప్ప.. హేళన చేయడం తగదు. 5 శాతం ఓట్ల మార్పుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరో 5 శాతం ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-24T01:08:00+05:30 IST