Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని శ్రీమన్నారాయణకు చంద్రబాబు నివాళి

కంచికచర్ల, డిసెంబరు3 : మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ భౌతికకాయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం దర్శించి, నివాళులర్పించారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గాన కంచికచర్ల వచ్చిన చంద్రబాబు శ్రీమన్నారాయణ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీమన్నారాయణ సతీమణి సీతమ్మను ఓదార్చారు. ఉమాతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీమన్నారాయణ టీడీపీకి ఎంతో సేవ చేశారని, ఉమా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, నారా లోకేశ్‌ ఫోన్‌ ద్వారా దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించారు.

Advertisement
Advertisement