Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోరంట్ల బుచ్చయ్యకు Chandrababu ఫోన్ చేసినా...!

అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని అధికారికంగా ఎమ్మెల్యే ప్రకటించేశారు. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత రాత్రి చౌదరికి చంద్రబాబు ఫోన్‌ చేశారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని.. అన్నీ సర్దుకుంటాయని కూడా బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినప్పటికీ బుచ్చయ్య మాత్రం 24 గంటల గ్యాప్‌లోనే తాను రాజీనామా చేసేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

తీవ్ర ఆవేదన..

కాగా.. తనను కించపర్చడమే కాకుండా తన ఇంటికి వచ్చిన వారిని కూడా దూషిస్తున్నారంటూ చంద్రబాబుకు బుచ్చయ్య చెప్పారు. అయితే.. పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనపట్ల ఇలా ప్రవర్తించడమేంటి..? అని హైకమాండ్‌తో పాటు కొందరు నేతలపై బుచ్చయ్య తీవ్ర ఆవేదనను బాబుకు చెప్పినట్లు తెలియవచ్చింది. అనుచరులతో మాట్లాడి ఈ నెల 25న రాజీనామా చేస్తానని బుచ్చయ్య ప్రకటించారు. అయితే.. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనయ్యారు. అంతేకాదు.. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాతే చంద్రబాబు నుంచి బుచ్చయ్యకు ఫోన్ కాల్ వెళ్లిందని తెలియవచ్చింది. అయితే 25 తారీఖు లోపు ఏమేం జరుగుతాయో వేచి చూడాలి. అనుచరులు, కార్యకర్తలు, ద్వితియశ్రేణి నేతలు 25న ఏం చెబుతారు..? బుచ్చయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో మరి.


Advertisement
Advertisement