అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే కేసులా..

ABN , First Publish Date - 2021-07-29T05:38:42+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం కవల పిల్లలుగా మారి రాజ్యమేలుతున్నాయని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుపై దాడిని ఖండించిన ఆయన పోలీసుల తీరును బుధవా రం ఒక ప్రకటనలో ఆక్షేపించారు.

అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటే కేసులా..
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

దాడులు, అరెస్టులతో పోరాటం ఆగదు 

బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి


పర్చూరు, జూలై 28 : రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం కవల పిల్లలుగా మారి రాజ్యమేలుతున్నాయని టీడీపీ బాపట్ల పార్లమెం ట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుపై దాడిని ఖండించిన ఆయన పోలీసుల తీరును బుధవా రం ఒక ప్రకటనలో ఆక్షేపించారు. అధికార పార్టీ అక్రమాలను వదిలి ఉమాపై అట్రాసిటీ, 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిం చారు. అక్రమాలకు దాడులకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను వదిలి టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటన్నారు. రా ష్ట్రంలో సహజ వనరులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని, మాజీ మంత్రిపై దాడిచేసి న కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు నవరత్నాలను పంచుతామని చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక పంచభూతాలను పంచుకుంటున్నారన్నారు. దేవినేని ఉమా కారులో ఉంటే కారు అద్దాలు పగులకొట్టి ఆయనపై దాడి చేసి న గూండాలను వదిలి దేవినేనిపై ఆయనతోపా టు గాయపడిన 18 మందిపై అక్రమ కే సులు బనాయించ టం అధికార పార్టీ అహంకామేనని ఆరో పించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు రూ. 15వేల కోట్ల మైనింగ్‌ సహజ వనరులను దోచుకుంటున్నారని, ఉమా పై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చే సి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-07-29T05:38:42+05:30 IST