Abn logo
Sep 23 2021 @ 01:41AM

టీడీపీ ఆత్మబంధువు దామచర్ల

వర్ధంతి సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌, వేదికపై ఎమ్మెల్యేలు ఏలూరి, గొట్టిపాటి, డోలా, ఇతర నాయకులు

ఆంజనేయులు వర్ధంతి సభలో  పార్టీ నేతలు 

తూర్పునాయుడుపాలెం (టంగుటూరు), సెప్టెంబరు 22 : మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ఆత్మబంధువు అని పలువురు అన్నారు. ఆంజనేయులు 14వ వర్ధంతి బుధవారం ఆయన స్వగ్రామమైన టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించారు. సభలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు దామచర్ల సొంతం అని కీర్తించారు. ఆయన జీవితం నీతి, నిజాయితీకి నిలువుటద్దమని, జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారని కొనియాడారు. ఆంజనేయులు మనుమళ్లు జనార్దన్‌, సత్య మాట్లాడుతూ తాత ఆశయాలకు కట్టుబడి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలకు ఆయన చేసిన నిస్వార్థ సేవల కారణంగానే ఇంతమంది అభిమానులను సంపాదించుకోగలిగామని చెప్పారు. తొలుత గ్రామంలోని ఆంజనేయులు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదికపై దామచర్ల దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్య నేతలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, డేవిడ్‌రాజు, దివి శివరాం, ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, కామని విజయకుమార్‌, బెల్లం జయంత్‌బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, రావుల పద్మ, అనంతమ్మ పాల్గొన్నారు