‘ఉపాధి’ బిల్లులు చెల్లించకుంటే న్యాయపోరాటం

ABN , First Publish Date - 2021-08-03T03:17:30+05:30 IST

ఉపాధి హామీ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం వాటా 75 శాతం రూ.4,590 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,535 కోట్లతో కలిపి రూ.6,125 కోట్లు విడుదల చేసి, 12శాతం వడ్డీతో రెండు రోజుల్లో చెల్లించకపోతే న్యాయపోరాటం చేస్తామని నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు.

‘ఉపాధి’ బిల్లులు చెల్లించకుంటే న్యాయపోరాటం
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో అజీజ్‌

నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌

ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా

కావలి, ఆగస్టు 2 : ఉపాధి హామీ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం వాటా 75 శాతం రూ.4,590 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,535 కోట్లతో కలిపి రూ.6,125 కోట్లు విడుదల చేసి, 12శాతం వడ్డీతో రెండు రోజుల్లో చెల్లించకపోతే న్యాయపోరాటం చేస్తామని నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు సబంధించిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో అజీజ్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విధ్వసం తప్ప సంక్షేమం తెలియదన్నారు. ఉపాధి హామీ పనులు చేసి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఇప్పటికే 58 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలోనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోవడం కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, కండ్లగుంట మధుబాబునాయుడు, బీద గిరిధర్‌, ఏగూరి చంద్రశేఖర్‌, కాకి ప్రసాద్‌, కే వెంకటేశ్వర్లు, మాలెపాటి నాగేశ్వరరావు, దావులూరి దేవ, తటవర్తి వాసు, మల్లికార్జున్‌రెడ్డి, జగదీష్‌, రాము, తదితరులు పాల్గొన్నారు. 

పలువురు నాయకులతో అజీజ్‌

నెల్లూరు పార్లమెంట్‌  టీడీపీ అధ్యక్షుడు, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అబ్దుల్‌ అజీజ్‌ సోమవారం కావలి పట్ణంలో పలు పార్టీల నాయకులను కలిసి ప్రజా సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. కావలిలోని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఆపార్టీ నాయకులతో కలసి మాట్లాడారు. సీపీఐ కార్యాలయంలో తాళ్లూరు మాల్యాద్రి, పీ.పెంచలయ్య, సీపీఐ కార్యాలయంలో దామా అంకయ్య, డేగా సత్యనారాయణ, కాంగ్రెస్‌ కార్యాలయంలో చింతాల వెంకట్రావును న్యూడెమక్రసీ కార్యాలయంలో కరువాది భాస్కర్‌ను కలిసి వారితో స్థానిక రాజకీయాల గురించి చర్చించారు. పార్టీల అజండాలు వేరైనా అందరం పోరాడేది ప్రజా సమస్యలపైనే అయినందున అందరం ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడుదామని కోరారు. అలాగే 33వ వార్డు ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ జ్వాలా సుబ్రహ్మణ్యం, 26వ వార్డులో టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి బ్రహ్మయ్య ఇళ్లకు వెళ్లి అక్కడ వారితో చర్చించారు. అలాగే 19వ వార్డులోని టీడీపీ నాయకులు పఠాన్‌ రసూల్‌ఖాన్‌, కాలేషాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకలు మలిశెట్టి వెంకటేశ్వర్లు, కండ్లగుంట మధుబాబు నాయుడు, యోగూరి చంద్రశుఖర్‌, అన్నపూర్ణ శ్రీను, తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.

కార్యకర్తలకు సముచిత స్థానం

తెలుగు దేశం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సముచిత స్థానం ఉంటుందని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు. బోగోలు మండలం విశ్వనాధరావుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు భీమవరపు మధు అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ శ్రీనివాసులు, మల్లిశెట్టి.వెంకటేశ్వర్లు, ఆవుల.సురేష్‌, జయకుమార్‌, అశోక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T03:17:30+05:30 IST