రోడ్ల పరిస్థితిపై టీడీపీ ప్రత్యక్ష పోరు

ABN , First Publish Date - 2021-07-25T05:10:54+05:30 IST

విశాఖ నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, ఎక్కడ చూసినా తవ్వేసిన, గుంతలతో కూడిన రహదారులే కనిపిస్తున్నాయని టీడీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి.

రోడ్ల పరిస్థితిపై టీడీపీ ప్రత్యక్ష పోరు
జ్ఞానాపురం పరిధిలో రోడ్ల తీరుపై నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

అధ్వాన రహదారులపై ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన

విశాఖపట్నం, జులై 24: విశాఖ నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని,  ఎక్కడ  చూసినా తవ్వేసిన, గుంతలతో కూడిన రహదారులే కనిపిస్తున్నాయని టీడీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి.  రహదారుల స్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసనల్లో భాగంగా  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.నజీర్‌, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కోరాడ రాజబాబు,విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి మూర్తియాదవ్‌ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం గ్రేటర్‌ 32వ వార్డు గోకుల్‌ థియేటర్‌ నుంచి అల్లిపురం మార్కెట్‌కు వెళ్లే రహదారి పరిస్థితిని ప్రజలకు చూపిస్తూ తమ నిరసన తెలిపారు.


దక్షిణ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిని ఫ్లెక్ల్సీల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నజీర్‌ మాట్లాడుతూ రెండేళ్లు గడుస్తున్నా నగరంలో రోడ్ల పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమన్నారు. అభివృద్ది అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో  56వ వార్డు కార్పొరేటర్‌ శరగడం రాజశేఖర్‌, లొడగల కృష్ణ, వార్డు అధ్యక్షుడు దాసరి దుర్గారెడ్డి, దాసన సత్యనారాయణ, పొలమరశెట్టి సీతారాం, బండుపల్లి సూర్యనారాయణ, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:10:54+05:30 IST