హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ: పీతల సుజాత

ABN , First Publish Date - 2021-10-08T00:41:32+05:30 IST

హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ: పీతల సుజాత

హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ: పీతల సుజాత

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): ఆడపిల్లలపై హత్యలకు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్ మారిందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. గాజువాకలో 8వ తరగతి చదువుతున్న బాలిక పావనిపై హత్యాచారం జరిపి, హత్య చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకొక సంఘటన జరుగుతున్నా ముఖ్యమంత్రి, హోంమంత్రి మొద్దునిద్ర పోతున్నారని మండిపడ్డారు. పసిపిల్లలపై మానవ మృగాళ్ళు రెచ్చిపోతూ జీవితాలను చిదిమేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని చెప్పారు.


గాజువాకలో బాలిక పావని హత్యాచారం చేసి ఆపై హత్య చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పిన విధంగా దిశ చట్టం ద్వారా నిందితులను 21 రోజుల్లో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి పీతల సుజాత సూచించారు. 

Updated Date - 2021-10-08T00:41:32+05:30 IST