సచివాలయ భవనానికి వైసీపీ రంగులు వేస్తోంటే అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

ABN , First Publish Date - 2020-02-22T21:06:01+05:30 IST

గ్రామ సచివాలయాలకు, పంచాయతీ భవనాలకు, తాగునీటి పథకాలకు వేస్తున్న వైసీపీ రంగుల విషయంపై న్యాయస్థానం ఆంక్షలు విధించినప్పటికీ

సచివాలయ భవనానికి వైసీపీ రంగులు వేస్తోంటే అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

న్యాయ స్థానాల ఆదేశాలు పట్టవా?

మార్టూరు సచివాలయ భవనానికి 

రంగులు వేస్తుండగా అడ్డుకున్న ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద 


తుమ్మపాల (విశాఖపట్టణం): గ్రామ సచివాలయాలకు, పంచాయతీ భవనాలకు, తాగునీటి పథకాలకు వేస్తున్న వైసీపీ రంగుల విషయంపై న్యాయస్థానం ఆంక్షలు విధించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం మార్టూరు సచివాలయ భవనానికి  వైసీపీ రంగులు వేస్తుండగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ఆయన అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను పార్టీ కార్యాలయాలుగా మార్చడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే కోర్టు ప్రభుత్వంపై అంక్షితలు వేసి ఆంక్షలు విధించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ అంశాన్ని భవిష్యత్తులో న్యాయస్థానాలతో పాటు చట్టసభల్లో సవాల్‌ చేయనున్నామన్నారు. ప్రభుత్వానికి కళ్లు నెత్తికెక్కి వ్యవహస్తోందని  స్థానిక  నాయకుల సైతం అందుకు వంత పాడుతున్నారని వారు ఆరోపించారు. తక్షణమే పంథాను మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోట్ని బాలాజీ, మండల నాయకులు పచ్చికూర రాము, కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T21:06:01+05:30 IST