రాష్ట్రంలో తుగ్లక్‌ పాలనను తలపిస్తోంది..

ABN , First Publish Date - 2020-08-05T10:52:41+05:30 IST

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలనను తలపిస్తోంది..

విజయనగరం రూరల్‌, ఆగస్టు 4 : రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు సా యంగా రైతులు వేలాది ఎకరాలు భూములు ప్రభు త్వానికి అప్పగిస్తే... ఇప్పుడు వారిని నిట్టనిలువునా ముంచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాను లు మార్చడం ఎక్కడైనా చూశామా? అంటూ ప్రశ్నిం చారు.


ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసిన జగన్‌.. ఇప్పుడు మాట మార్చడంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉ న్నప్పుడు మడమ తిప్పని జగన్‌.. అధికారంలోకి వచ్చి న తర్వాత మాట, మడమ రెండు తిప్పేస్తున్నార న్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అప్రజాస్వామిక చర్యని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రా యాన్ని కోరాలని ఆయన  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-08-05T10:52:41+05:30 IST