చంద్రబాబు ఇంటిపై దాడి దారుణం

ABN , First Publish Date - 2021-09-18T05:10:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

చంద్రబాబు ఇంటిపై దాడి దారుణం
నరసాపురంలో కొవ్వలి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల నిరసన

టీడీపీ నాయకుల ఆందోళన 

నరసాపురం, సెప్టెంబరు 17: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొవ్వలి రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పదవుల కోసం ఇటువంటి దాడులకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. జగన్‌ పాలనలో జరుగుతున్న అరాచకాలకు ఇదొక నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. నల్లకండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వార్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో బర్రె ప్రసాద్‌, కొప్పాడ రవి, పాలూరి బాబ్జి, మల్లాడి మూర్తి, జక్కం శ్రీమన్నారాయణ, మౌలాలీ, కొల్లు పెద్దిరాజు, లక్ష్మినారాయణ, బండారు ప్రతాప్‌నాయుడు, చిటికెల రామ్మోహన్‌, రెడ్డిం శ్రీను, కొట్టు పండు, గన్నవరపు శ్రీనువాస్‌,బళ్ల మూర్తి, అంబటి ప్రకాష్‌, కృష్ణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్టు చేయాలి..


ఆకివీడు, సెప్టెంబరు 17: జడ్‌ క్యాటగిరి ఉన్న మాజీ సీఎం చంద్రబాబును చంపడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని మండల, పట్టణ టీడీపీ నాయకులు మోటుపల్లి రామవర ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి ఎండీ అజ్మల్‌,  పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, ఆరీఫ్‌, గంధం ఉమా, జాకీర్‌,  అల్లు సాంబ, షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి సీఎం జగన్‌ రమేష్‌కు మంత్రి పదవి ఎర్రచూపి దాడి చేయించడం దుర్మార్గమన్నారు.


రౌడీ మూకల దాడి పాశవిక చర్య : తోట సీతారామలక్ష్మి


 భీమవరం, సెప్టెంబరు 17 : చంద్రబాబు ఇంటిపై దాడికి వెళుతున్నామంటూ ప్రకటించి మరీ వెళుతున్న వైసీపీ మూకలను నిలువరించకుండా పోలీసులు చోద్యం చూడటం సిగ్గు చేటు.. ఆ రౌడీ మూకలు దాడి పాశవిక చర్య అంటూ మాజీ ఎంపీ, తెలుగుదేశం నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు. కర్రలు, సీసాలు, రాళ్లతో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి చేసేందుకు వెళుతున్న నేతలు, ఎమ్మెల్యే జోగి రమేష్‌ అతని అనుచరులను పోలీసులు ఎందుకు అదుపు చేయలేదన్నారు. ఉండపల్లిలో జరిగిన ఘటనను పరిశీలిస్తే పోలీసులే దగ్గరుండి ఆందోళనను ప్రోత్సహించారని, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే చోటకు మారణాయుధాలతో వెళ్తున్న వారిని అడ్డుకోరా? అన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వైసీపీ నేతలు ఒక్కటే గుర్తుంచుకోవాలని 70 లక్షల పసుపు సైన్యం తిరగబడితే మీ తాడేపల్లి తాలిబాన్ల పరిస్థితేంటో గ్రహించాలని హెచ్చరించారు.చంద్రబాబు ఇంటిపై దాడి దుర్మార్గ చర్య అని ఏఎం సీ మాజీ చైర్మన్‌ కోళ్ళ నాగేశ్వరరావు ఖండించారు. వైసీపీ దారుణాలను ప్రజలు చూస్తున్నారన్నారు.  


 దాడి హేయం : పాతూరి


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రామ్‌ప్రసాద్‌చౌదరి ఖండించారు. పెడన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు చంద్రబాబు నివాసంపై రాళ్లు, కర్రలతో దాడి చేయడాన్ని ఖండించారు. ప్రతిపక్ష నాయుకుడిపై 100 మంది వైసీపీ అనుచరులతో దాడి చేయడం నీచమైన చర్య అన్నారు. జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నవాళ్ళకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని పోలీసులపై మండిపడ్డారు. 


దాడి దారుణం : ఎమ్మెల్యే రామరాజు


 ఉండి, సెప్టెంబరు 17 :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామ రాజు తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకే వన్నె తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అటువంటి వ్యక్తి నివాసంపై దాడి చేయడం సభ్యసమాజం తలదిం చుకునేలా..సిగ్గుపడేలా ఉందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడినవారిని తక్షణ మే పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.   




Updated Date - 2021-09-18T05:10:50+05:30 IST