నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-28T15:38:15+05:30 IST

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు అరెస్ట్ అయ్యారు. పాలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా టీడీపీ కార్యకర్తలను పోలీసులు పీఎస్‌లోనే ఉంచారు.

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు అరెస్ట్

గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబు అరెస్ట్ అయ్యారు. పాలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా టీడీపీ కార్యకర్తలను పోలీసులు పీఎస్‌లోనే ఉంచారు. టీడీపీ కార్యకర్తలను విడిచి పెట్టాలని అరవింద్‌బాబు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుట భైఠాయించారు. బలవంతంగా అరవింద్‌బాబును అరెస్టు చేసి పోలీసులు స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై స్టేషన్‌లోఅరవింద్‌బాబు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను విడిచిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని అరవింద్‌బాబు పేర్కొన్నారు. స్టేషన్ దగ్గరకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. 


Updated Date - 2021-08-28T15:38:15+05:30 IST