Abn logo
Sep 26 2021 @ 00:23AM

రైతు ద్రోహి జగన

రాయదుర్గం రూరల్‌, సెప్టెంబరు 25: జిల్లాలో వర్షాలు లేక వేరుశనగ పంట నిలువునా ఎండిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనీ, ముఖ్యమంత్రి జగన రైతు ద్రోహిగా నిలిచిపోతాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన మండలంలోని ఆవులదట్ల, రేకులకుంట గ్రామాల్లో వర్షాలు లేక ఎండిపోతున్న వేరుశనగ పంటను పరిశీలించారు. ఈసందర్భంగా కాలవ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట సాగు చేశారన్నారు. సకాలంలో వర్షాలు కురవక పంట నిలువునా ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మొదట్లో వర్షాలు సమృద్ధిగా కురిసినా.. చివరలో వర్షాలు లేక పొలాల్లోనే పంట ఎండిపోవడం చూసి రైతులు కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. రైతుల గోడు వినే పరిస్థితిలో లేరన్నారు. జిల్లాలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రక్షక తడులు ఇవ్వడంతో పాటు పంట నష్టాన్ని లెక్కించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ హనుమంతు, సర్పంచలు వన్నూరుస్వామి, మల్లయ్య, జుంజురాంపల్లి సర్పంచ వన్నూరుస్వామి, సింగయ్యచౌదరి, ప్రసాద్‌, లచ్చన్న, సోమశేఖర్‌, వీరేష్‌, మాజీ సర్పంచ హనుమంతు, గిరిధర్‌ నాయుడు, మాజీ ఎంపీటీసీ పురుషోత్తమ్‌, గుమ్మఘట్ట టీడీపీ నాయకులు కాలవ సన్నణ్ణ, దానవేంద్ర, తిమ్మారెడ్డి, జిలాన, ఓబయ్య, వీరేష్‌, సంజీవ, తెలుగు యువత నాయకులు మురళి, షమీ పాల్గొన్నారు.