Abn logo
May 14 2021 @ 12:15PM

జగన్...అబద్దాల ముఖ్యమంత్రి: అచ్చెన్నాయుడు

విశాఖపట్నం: కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పారాసిట్మాల్, బ్లీచింగ్‌తో కరోనా పోతుందని సీఎం మాట్లాడి.. నాన్ సీరియస్‌గా తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా..కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి అనడం దారుణమన్నారు. కరోనా విషయంలో దేశంలోనే ఏపీ 5 వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. గ్లోబల్ టెండర్లను తమ ఒత్తిడితోనే పిలిచారన్నారు. జగన్...అబద్దాల ముఖ్యమంత్రి..కరోనా మరణాలపై అబద్ధాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. వెంటిలేటర్లు బెడ్స్ కావాలని పీఎంకు జగన్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు కులం ఆపాదించడం దారుణమన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం లేదని...వైసీపీ నేతలకు,కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు.


‘‘ఏపీ నుంచి తెలంగాణాకు అంబులెన్సులు పంపించడం చేతకాని సీఎం జగన్ సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను...ఆరోగ్యశ్రీలో ఎంత మందికి వైద్యం అందించారో శ్వేతపత్రం ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు. విజయ సాయిరెడ్డి  ఈ రోజు 300 బెడ్స్ ఆసుపత్రిని ప్రారంభించారని..ఆయనకు ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. కరోన మీద ఎవరైనా మాట్లాడితే.. కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కొనసాగిస్తే..కొత్తగా ఆసుపత్రిలు వచ్చేవి..బెడ్స్ కొరత వచ్చేది కాదన్నారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సు కేసీఆర్ అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా తీవ్రత దృష్ట్యా10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement