Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు.. భావితరాల భవిష్యత్ యాత్ర: Achenna

అమరావతి: రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్ రెడ్డికి చలిజ్వరం పట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు యెద్దేవా చేశారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు..భావితరాల భవిష్యత్ యాత్ర అని అన్నారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే అని ఆయన పేర్కొన్నారు. అధికార దాహంతో జగన్ పాదయాత్ర చేస్తే.. రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి చేసిన మోసానికి వైసీపీకి చెందిన రైతులు కూడా బోరుమంటున్నారన్నారు. పాదయాత్రను ప్రజల ముందుకు తీసుకెళ్తున్న మీడియాపైనా పోలీసులు అహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమయ్యాయని అచ్చెన్నాయుడు అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement