ఆడపడుచులచే కన్నీళ్లు పెట్టించారు..ఆ పాపం ఊరికే పోదు: అయ్యన్న

ABN , First Publish Date - 2020-08-02T17:58:58+05:30 IST

ఆడపడుచులచే కన్నీళ్లు పెట్టించారు..ఆ పాపం ఊరికే పోదు: అయ్యన్న

ఆడపడుచులచే కన్నీళ్లు పెట్టించారు..ఆ పాపం ఊరికే పోదు: అయ్యన్న

అమరావతి: మూడు రాజధానులకు ఆమోదం తెలుపి....శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులచే కన్నీళ్లు పెట్టించారని ఆ పాపం ఊరికే పోదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను బాధపెట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారని హెచ్చరించారు. ఇక్కడే రాజధాని ఉండాలని... కనీసం 40వేల ఎకరాలు రాజధానికి కావాల్సిన అవసరం ఉందని, రాజధానికి పూర్తి మద్ధతు ఇస్తున్నామని జగన్ చెప్పింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల మాట మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.


గుంటూరు, కృష్ణ జిల్లా ఎమ్మెల్యేలందరూ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన మాట వాస్తవం కాదా అని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని... సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన వెనకాల ఎవరి ప్రోత్బలం ఉందో ప్రజలు ఆలోచించాలని అయ్యన్న తెలిపారు. సోమువీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయినప్పుప్పటి నుంచి రాజధాని విషయంలో పూటకో మాట మాట్లాడారని మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాన మంత్రి మోదీ చేతులతోనే చేశారని.. మట్టి, నీళ్లు ఇచ్చారని... బీజేపీ ఈ విషయాలను పునరాలోచించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని విభజించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏమయ్యిందో చూశామని గుర్తుచేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రెడ్డి చెంచాలు మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

Updated Date - 2020-08-02T17:58:58+05:30 IST