పరిమితికి మించి తవ్వకాలు

ABN , First Publish Date - 2021-06-18T04:58:07+05:30 IST

రూరల్‌ మండలంలోని గొల్లకందుకూరు ఇసుక రీచ్‌ను టీడీపీ నేత, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి అబ్దుల్‌అజీజ్‌ గురువారం పరిశీలించారు. రీచ్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష క్యూబిక్‌ మీటర్లను ఎప్పుడో తవ్వేశారని, ప్రస్తుతం పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.

పరిమితికి మించి తవ్వకాలు
రీచ్‌లో ఇసుక తవ్వకాలను పరిశీలిస్తున్న అజీజ్‌

గొల్లకందుకూరు రీచ్‌పై అజీజ్‌ అభ్యంతరం

నెల్లూరు రూరల్‌, జూన్‌ 17 : రూరల్‌ మండలంలోని గొల్లకందుకూరు ఇసుక రీచ్‌ను టీడీపీ నేత, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి అబ్దుల్‌అజీజ్‌ గురువారం పరిశీలించారు. రీచ్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష క్యూబిక్‌ మీటర్లను ఎప్పుడో తవ్వేశారని, ప్రస్తుతం పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలను, సహాజ వనరులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక రీచ్‌ నిర్వాహకులు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాబీర్‌ఖాన్‌, ఖాజావలీ, మాతంగి కృష్ణ, సుధాకర్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:58:07+05:30 IST