ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-08-05T17:34:47+05:30 IST

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: బోండా ఉమ

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: బోండా ఉమ

అమరావతి: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడూతూ ప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. జగన్ చెప్పే దిశ చట్టం, స్పందన యాప్‌లు మహిళలను కాపాడలేక పోతున్నాయని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఎస్సీ మహిళపై 12 మంది పైసాచికంగా అత్యాచారం చేశారు నిజం కదా? అని ప్రశ్నించారు. 


గుంటూరు జిల్లా నకిరేకల్‌లో గిరిజన మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి మరీ చంపాడు నిజమా కాదా? అని నిలదీశారు. అధికార పార్టీ నేత కాబట్టి ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు నిజం కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ.. జగన్ పబ్లిసిటీ పిచ్చి తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం ఎక్కడా జరగలేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు నిజం కదా అని బోండా ఉమా విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-08-05T17:34:47+05:30 IST