ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతకాలి?: Bonda uma

ABN , First Publish Date - 2021-11-09T19:04:09+05:30 IST

అడ్డూ ఆపూ లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగ నిత్యావసర వస్తు ధరలు, పెట్రోల్ రేట్లను పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతకాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రశ్నించారు.

ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతకాలి?: Bonda uma

విజయవాడ: అడ్డూ ఆపూ లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగ నిత్యావసర వస్తు ధరలు, పెట్రోల్ రేట్లను పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతకాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రశ్నించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ ధర్నాచౌక్‌లో బోండా ఉమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తు ధరలతో పాటు కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నిరసన తెలిపారు. ధరలను అదుపు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.


బీజేపీ పాలిత ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి తగ్గించాయన్నారు. ఆంధ్రాలోనే జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని మండిపడ్డారు.  ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలకి న్యాయం జరిగేంత వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ధరలను తక్షణమే నియంత్రించాలని... లేకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని బోండా ఉమా పేర్కొన్నారు. 

 

Updated Date - 2021-11-09T19:04:09+05:30 IST