వెల్లంపల్లి ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా?: బుద్ధా వెంకన్న

ABN , First Publish Date - 2021-02-24T19:36:30+05:30 IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో జరిగిన ఏసీబీ సోదాల్లో అసలు దొంగ వెల్లంపల్లిని వదిలేశారన్నారు.

వెల్లంపల్లి ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా?: బుద్ధా వెంకన్న

అమరావతి: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో జరిగిన ఏసీబీ సోదాల్లో అసలు దొంగ వెల్లంపల్లిని వదిలేశారన్నారు. చిరుద్యోగులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, అవినీతి తిమింగలాన్ని వదిలేసిందని మండిపడ్డారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉండి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనంత  దోపిడీకి వెల్లంపల్లి పాల్పడ్డారని ఆరోపించారు. దుర్గుగుడిలో మాయమైన చీరలు వెల్లంపల్లి ఇంటిలో, ఆయన దుకాణంలో ఉంటాయన్నారు. దేవాలయంలోని స్టోర్‌లోని సరుకులు కూడా శ్రీనివాస్ ఇంటికే చేరుతాయని వ్యాఖ్యానించారు. రూ.కోటిరూపాయలు అమ్మవారికి కానుకల రూపంలో వస్తే అందులో రూ.50 లక్షలు మంత్రే కాజేస్తాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా తనిఖీలు జరిపితే వెల్లంపల్లి అవినీతి బాగోతం తేలుతుందన్నారు. వెల్లంపల్లిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారిస్తే దేవాలయాల సాక్షిగా ఆయన సాగిస్తున్న దోపిడీ బయటపడుతుందని తెలిపారు. దేవుడి సొమ్ము రూపాయి కూడా తాను తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తన బిడ్డలపై ప్రమాణం చేసి శ్రీనివాస్ చెప్పగలడా? అని సవాల్ విసిరారు. దానిపై కూడా ముఖ్యమంత్రి జగన్ విచారణ జరిపించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-02-24T19:36:30+05:30 IST