Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరలోనే ‘AP Deputy CM అవినీతి చిట్టా విప్పుతా..’

చిత్తూరు జిల్లా/వెదురుకుప్పం : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అవినీతి చిట్టా త్వరలో విప్పుతానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్బీసుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చుట్టూ ఉన్న అవినీతి పరులను కట్టడి చేయమని సలహా ఇస్తే తనపైనే తప్పుడు ఆరోపణలు చేయిస్తే భయపడేది లేదన్నారు. గేటు పుత్తూరు వ్యవహారాలు, పుత్తూరులో లాండ్రీ కథలు, శ్రీసిటీ అవినీతి, తిరుమల వీఐపీ దర్శనాల బాగోతం లాంటివి అన్నీ బయట పెడతానన్నారు. పెనుమూరు బస్టాండుకు ఆనుకుని ఉన్న తమ స్థలం దేవుడి మాన్యం అని చెప్పడం మూర్ఖత్వం అన్నారు. 

Advertisement
Advertisement