Abn logo
Mar 1 2021 @ 07:55AM

నేడు తిరుపతిలో చంద్రబాబు నిరసనలకు అనుమతి నిరాకరణ

తిరుపతి: నేడు తిరుపతిలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు  చేపట్టనున్న నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నందున చంద్రబాబు నిరసనలకు అనుమతించటం లేదని ఈస్ట్ డీఎస్పీ తెలిపారు. టీడీపీ అధినేత  తిరుపతిలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద  నిరసనలు  చేపట్టాలని  నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని  టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు. 

Advertisement
Advertisement
Advertisement