అమ్మఒడికి మూడో సంవత్సరంలోనే మంగళం: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2021-10-15T03:05:28+05:30 IST

ప్రతి సంవత్సరం జనవరిలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల చదువుల కోసం విడుదల చేసే 15 వేల రూపాయిలను మూడో ..

అమ్మఒడికి మూడో సంవత్సరంలోనే మంగళం: దాసరి శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం: ప్రతి సంవత్సరం జనవరిలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల చదువుల కోసం విడుదల చేసే 15 వేల రూపాయిలను మూడో సంవత్సరంలో ఈ జనవరిలో విడుదల చేయల్సి ఉండగా దానిని కాస్త జూన్లో విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి మరోసారి మాటతప్పి మడమ తిప్పారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు. విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.


‘‘ఈ ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్య రద్దు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు. విద్యోన్నతి రద్దు, ప్రతిభా అవార్డులు రద్దు. జీవో నెంబర్ 77తో ఉన్నత విద్యకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం రద్దు. ప్రతియేటా డీఎస్సీ లేదు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడు ఆఖరికి అమ్మవడి. నవశఖాలు కూడా గోవిందా. ఈ రాష్ట్రంలో 85 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే అమ్మవడి ఇచ్చి మిగితావారిని చదువుకు దూరం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ కాస్త పధకాలను కూడా ఆటకెక్కించి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వారిని చదువుకు దూరం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు’’ అని శేషు అన్నారు.


ఎయిడెడ్ సంస్థలను నాశనం చేసి అందులో పని చేసే వారిని తీసుకొచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టింగ్ ఇచ్చి నిరుద్యోగులకు నట్టేటా ముంచిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని దాసరి శేషు విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి జనవరిలోనే అమ్మవడి డబ్బులు వేయాలని శేషు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-15T03:05:28+05:30 IST