ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే...?: Devathoti

ABN , First Publish Date - 2022-01-20T16:47:24+05:30 IST

ఏ ప్రభుత్వమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే.. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే...?: Devathoti

అమరావతి: ఏ ప్రభుత్వమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే.. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.  అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి జీతాలు పెంచమనే స్థాయి నుంచి "తగ్గించొద్దు మహాప్రభో" అని వేడుకొనే పరిస్థితి దాకా వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఉద్యోగుల పరిస్థితి పాలిచ్చే బర్రెని వదిలేసి... తన్నించుకునే దున్నపోతును చేరదీసినట్లు ఉందని దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-01-20T16:47:24+05:30 IST