Advertisement
Advertisement
Abn logo
Advertisement

శంకుస్థాపన చేసిన ఇళ్లకే మళ్లీ శంకుస్థాపనలు: దేవినేని

అమరావతి:  వైఎస్సార్ జగనన్న కాలనీ ప్రాజెక్ట్ ప్రారంభంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘6 నెలల క్రితమే 3 చోట్ల పైలాన్ ఆవిష్కరణ. శంకుస్థాపన చేసిన అవే ఇళ్లకు మళ్లీ శంకుస్థాపనలు. భూమి పూజ మాత్రం 2 సార్లు !. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కట్టిన టిడ్కో ఇళ్ళు ఇవ్వరు. ఏడాదికి 5 లక్షలన్నారు, 2 ఏళ్లయ్యాయి ఇళ్ళు కట్టరు, కట్టుకుంటామంటే ప్రభుత్వం వినదంటున్న లబ్దిదారులమాటలు వినబడుతున్నాయా? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.


Advertisement
Advertisement