మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా సర్కార్ కసరత్తు: devineni

ABN , First Publish Date - 2021-07-22T17:00:59+05:30 IST

రాష్ట్రంలో మద్యం షాపులు, అమ్మకాలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా సర్కార్ కసరత్తు: devineni

అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులు, అమ్మకాలపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా సర్కార్ కసరత్తు చేస్తోందని మండిపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... నియంత్రణ లేదూ, నిషేధమూ రాదన్నారు. ఏడాదికి రూ.2400 కోట్ల అమ్మకం లక్ష్యంగా కొత్తగా 300 షాపులు తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యంపై పన్నుచూపి రూ. 21,500 కోట్ల అప్పు తీసుకువచ్చారన్నారు. అస్మదీయుల జేబులు నింపేలా సొంత నాసిరకం మద్యం బ్రాండ్‌లకే అనుమతి ఇస్తున్నారన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మద్య నిషేధం అటకెక్కినట్లేనా? వైయస్ జగన్ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.  ప్రశ్నించారు. 



Updated Date - 2021-07-22T17:00:59+05:30 IST