Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక అవకతవకలపై ప్రజలకు సమాధానం చెప్పండి: Devineni

అమరావతి: పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులు స్వాహా అవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘ పీడీ ఖాతాలతో అన్ని శాఖల నిధులు స్వాహా. చలానాలు, పరీక్ష ఫీజులు, పంచాయితీ, మున్సిపాలిటీల ఆదాయాలను సైతం వదల్లేదు. పీడీ ఖాతాల దెబ్బకు అన్ని శాఖల గల్లాపెట్టెలు ఖాళీ. కార్యాలయాల నిర్వహణకు చిల్లిగవ్వలేనీ వైనం. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఆర్థిక అవకతవకలపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.   


Advertisement
Advertisement