Advertisement
Advertisement
Abn logo
Advertisement

పన్నుల మోతలో ఏపీ మొదటిస్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా?: దేవినేని

విజయవాడ: పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘పెట్రో పన్నుల భారంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్. సెంచరీదాటినా తగ్గేదిలేదంటున్న సర్కార్. కోవిడ్ కాలంలో భారం తగ్గించిన ఇతర రాష్ట్రాలు. ఏపీలో మాత్రం వ్యాట్, రోడ్ సెస్ పేరుతో అదనపు బాధుడుతో భారం. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న ఏపీ పన్నుల మోతలో మొదటిస్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా?’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement