బాబాయిది గుండెపోటన్నారు... గొడ్డలిపోటని బయటపడింది: Devineni

ABN , First Publish Date - 2021-11-14T18:50:38+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

బాబాయిది గుండెపోటన్నారు... గొడ్డలిపోటని బయటపడింది: Devineni

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘బాబాయిది గుండె పోటు అని చెప్పి నమ్మించాలని చూశారు, గొడ్డలి పోటు అని బయటపడింది. కుక్కను చంపారు, బాబాయిపై వేటు వేసి కుట్లు వేశారు?... ఇంతకీ బాబాయ్ హత్య వెనక ఉన్న అసలు పెద్దలు ఎవరు?.. అందిన సొమ్ములు, వాడిన ఆయుధాలు ఎక్కడివో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-11-14T18:50:38+05:30 IST