Advertisement
Advertisement
Abn logo
Advertisement

లోకేష్‌ను జైల్లో పెట్టాలని చూస్తున్నారు

విజయవాడ: టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ను వచ్చే నెలలో జైల్లో పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను కృష్ణాజిల్లాలో అమలు చేయాలని చూస్తున్నారన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరుగకపోతే కలెక్టర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. చిన్న ఉద్యోగస్తులపై వేటు వేసి, తప్పు చేసిన వారిని దాచారని ఆయన ఆరోపించారు.


పోలీసుల సమక్షంలో తనపై దాడి జరిగిందన్నారు. పోలీసులను కొడుతుంటేనే దగ్గరలో ఉన్న పోలీసులు రాలేదన్నారు. కారులో ఉన్న తనను కార్యకర్తలు, పార్టీ నాయకులే రక్షించారని ఆయన తెలిపారు. 15 గంటలు కుర్చీలలో కూర్చోపెట్టి తనను పోలీసు స్టేషన్లు తిప్పారని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు, చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ వచ్చానని ఆయన అన్నారు. మొత్తం పరిణామాలపై కోర్టును ఆశ్రయిస్తానని దేవినేని ఉమా పేర్కొన్నారు.

Advertisement
Advertisement