‘సీఎంకు ఇష్టం లేకపోతే సంప్రదాయాన్ని మారుస్తారా..?’

ABN , First Publish Date - 2020-09-21T13:59:37+05:30 IST

సీఎం జగన్‌కి డిక్లరేషన్‌పై సంతకం చేయటం ఇష్టం లేదని.. తిరుపతిలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మా రుస్తారా అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో

‘సీఎంకు ఇష్టం లేకపోతే సంప్రదాయాన్ని మారుస్తారా..?’

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌కి డిక్లరేషన్‌పై సంతకం చేయటం ఇష్టం లేదని.. తిరుపతిలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మా రుస్తారా అంటూ  టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు హిందూ సంప్రదాయాలను మంట గలుపుతూ వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకో దేవాలయంపై దాడి, విగ్రహాలు ధ్వంసం, మాయం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభు త్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి వ్యవహారం చూస్తుంటే అన్యమతస్తులు ఎవరైనా కొండమీదకి రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అన్నట్లుగా  ఉందని మండిపడ్డారు. వేంకటేశ్వరస్వామి నిధులపై ఉన్న శ్రద్ధ స్వామి సంప్రదాయాలను కాపాడటంలో ఎందుకు లేదని జీవీ ప్రశ్నించారు.

Updated Date - 2020-09-21T13:59:37+05:30 IST