అయ్యన్న సవాల్‌కు ప్రభుత్వం, సీఐడీ సిద్ధమా?: పట్టాభి

ABN , First Publish Date - 2021-12-19T00:33:03+05:30 IST

ఏపీని మూడు ముక్కలు చేస్తే ప్రజలు సహించరని టీడీపీ నేత పట్టాభి అన్నారు. కొందరు పోలీసుల తీరు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ అంటే చిత్తం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌గా...

అయ్యన్న సవాల్‌కు ప్రభుత్వం, సీఐడీ సిద్ధమా?: పట్టాభి

విశాఖ: ఏపీని మూడు ముక్కలు చేస్తే ప్రజలు సహించరని టీడీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత పట్టాభి అన్నారు. కొందరు పోలీసుల తీరు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ అంటే చిత్తం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందన్నారు. రాజధాని పేరిట విశాఖలో వైసీపీ నేతలు భూ దందా చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో రాజన్న రియల్ ఎస్టేట్ కంపెనీని తెరిచారని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు తమకొద్దీ పులివెందుల రాజకీయాలు అంటున్నారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులపై కక్షసాధింపులకు దిగారని పట్టాభి ఆరోపించారు. ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అయ్యన్న సవాల్ స్వీకరించేందుకు ప్రభుత్వం, సీఐడీ సిద్ధమా? అని పట్టాభి సవాల్ విసిరారు. 

Updated Date - 2021-12-19T00:33:03+05:30 IST