Advertisement
Advertisement
Abn logo
Advertisement

లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.15 తగ్గించాలి: Gorantla

రాజమండ్రి: పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల సైకిల్ తొక్కుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 22 రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజీల్‌లపై వ్యాట్ తగ్గించాయన్నారు. ఏపీలో పెట్రోల్, డీజీల్‌పై రాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు 40 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తోందని మండిపడ్డారు. మాటతిప్పిన, మడమతిప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. లీటర్ పెట్రోల్, డీజీల్‌పై రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వైసీపీ రంగులు వేసుకునేందుకు, పత్రికల్లో ప్రకటనలు కోసం ఆరు వేల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల ప్రజలంతా వాహనాలు పక్కన పెట్టి సైకిల్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలంతా ఉద్యమబాట పట్టి రోడ్లపైకి వస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement