Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే మీ కథ తేలుస్తాం: GV

గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే బొల్లాపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శావల్యాపురం ఓటమితో ఎమ్మెల్యే బొల్లాకు మైండ్ దొబ్బిందన్నారు. ప్రజా వ్యతిరేకత జీర్ణించుకోలేక బొల్లా కారుమంచిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలనుకుంటున్నారని మండిపడ్డారు. ’’పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే మీ కథ తెలుస్తాం’’ అంటూ హెచ్చరించారు. శావల్యాపురం జెడ్పీటీసి ఓటమిపై స్థానికులు, వైసీపీ నేతలు బొల్లాను నిలదీశారన్నారు. వైసీపీ వారిని శాంతించడానికే ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. కారుమంచిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల మధ్య బొల్లా చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారన్న అక్కసుతో విగ్రహాలు తొలగిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తే ప్రజా క్షేత్రంలో బొల్లా సంగతి తేలుస్తామని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. 

Advertisement
Advertisement