అమరావతి: ప్రభుత్వోద్యోగుల హక్కులను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ ట్వీట్ చేశారు. ‘63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ హక్కుల కోసం పోరాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణాలో 7.5 శాతం ఫిట్మెంట్ అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటో? వైసీపీ ప్రభుత్వం ముందు సాగిలా పడి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యోగస్తుల హక్కులను తాకట్టు పెట్టిన కొంతమంది సంఘాల నాయకులు ఇప్పటికైనా మేల్కొంటారా? లేక జగన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేసి ఉద్యోగస్తులను మోసం చేస్తారా?’ అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం