Ananatpur: కాల్వ శ్రీనివాసులు వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-08-28T16:56:38+05:30 IST

జిల్లాలోని బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ పరిసరాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Ananatpur: కాల్వ శ్రీనివాసులు వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

అనంతపురం: జిల్లాలోని బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ పరిసరాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉప్పర హల్ క్రాస్ వద్ద మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాల్వను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో మాజీ మంద్రి తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.  పాదయాత్ర చేసి తీరుతానని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాద యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అనుమతి కోసం వినతి పత్రాన్ని కూడా తీసుకోవడం లేదని తెలిపారు. పాదయాత్ర అప్రజాస్వామిక పద్ధతి అని పోలీసులు అనడం సిగ్గుచేటని కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.  భారీగా టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. 


కాగా....పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంపు ధరలకు నిరసనగా ఉద్దేహాల్ గ్రామం నుంచి బొమ్మన హాల్ మండల కేంద్రం వరకు పాదయాత్ర చేసేందుకు కాల్వ శ్రీనివాసులు పూనుకున్నారు. ఈ క్రమంలో పాదయాత్రను అడ్డుకునేందుకు ఉద్దేహల్ గ్రామ పరిసరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో వందల మంది పోలీసులు రోడ్లపై మొహరించారు. ఉద్దేహల్ గ్రామం వైపు ఎవరిని అనుమతించని పరిస్థితి నెలకొంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ అమల్లో ఉంది అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.   పాదయాత్ర నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బొమ్మనహల్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-08-28T16:56:38+05:30 IST