Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌తో డాక్టర్ రోజి మృతిపట్ల లోకేష్ సంతాపం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన డాక్టర్ రోజి కొవిడ్ కారణంగా మృతి చెందటం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. నీట్ రాసి మంచి ర్యాంకుతో ఏలూరు ఆశ్రం  వైద్యకళాశాలలో సీటు సంపాదించి విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే హౌస్ సర్జన్‌గా చేరడం ఎంతో గర్వకారణమన్నారు. కొవిడ్ బాధితులకు వైద్యసేవలందిస్తూ వైరస్ బారినపడి కన్నుమూయడంతో కన్నవాళ్లకు తీరని విషాదం మిగిలిందన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న రోజి అకాల మరణం పట్ల తన సంతాపం తెలిపారు. ఎంతో మందికి ప్రాణభిక్ష పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement