Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరిటాల రవికి ఘన నివాళులు: లోకేష్

అమరవాతి: దివంగత నేత పరిటాల రవి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘన నివాళులర్పించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన అస్తమించని రవి అని అన్నారు.  కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యాకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు పరిటాల రవి అని తెలిపారు. అరాచక శక్తుల పాలిట సింహ స్వప్నమై, పేద వారి పాలిట ఆపద్బాంధవుడై ప్రజల గుండెల్లో  శాశ్వతంగా నిలిచిపోయారని లోకేష్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement