Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి: Lokesh

రాజమండ్రి: సీఎం జగన్‌ ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బలవంతంగా ముంపు గ్రామాల్లోని ఇళ్లను కూల్చి వేస్తున్నారన్నారు. నిర్వాసితుల కోసం అఖిలపక్షం ఢిల్లీలో ఉద్యమాలు చేస్తే హడావిడిగా రూ.10 లక్షలు ఇస్తామన్నారని.. కానీ ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని మంత్రి కన్నబాబు ఆరోపిస్తున్నారని అన్నారు. కన్నబాబుకు దమ్ముంటే జగన్‌ ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని లోకేష్ సవాల్ విసిరారు. 

Advertisement
Advertisement