Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవరెలా పోతే నాకేంటి...నేను హాయిగా నిద్రపోతే చాలన్నట్టుగా జగన్ శైలి: Lokesh

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాలన వల్ల రాష్ట్రం అధోగతిలో అగ్రస్థానంలో నిలవగా..ప్రగతిలో చిట్టచివరి స్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎవరెలా చస్తే తనకేంటి తాడేపల్లి కొంపలో తాను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టు ఉంది జగన్ రెడ్డి గారి వ్యవహార శైలి అని మండిపడ్డారు. థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్ని వేగవంతం చేశాయన్నారు.  రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 18 ఏళ్ళు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి దేశంలోనే అట్టడుగుస్థానంలో ఉందన్నారు. కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు... వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని తెలిపారు. మాస్కుతో మొఖం తుడుచుకొని, తాడేపల్లి కొంపలో ముడుచుకొని పడుకున్న జగన్ రెడ్డి గారు నిద్రలేవాలని యెద్దేవా చేశారు. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై మేల్కొనాలని లోకేష్ హితవుపలికారు. 

Advertisement
Advertisement