రేపు పిఠాపురం, గొల్లప్రోలుల్లో లోకేష్‌ రోడ్‌షో

ABN , First Publish Date - 2021-03-06T05:56:59+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 7వ తేదీన రోడ్‌షో నిర్వహించనున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు.

రేపు పిఠాపురం, గొల్లప్రోలుల్లో లోకేష్‌ రోడ్‌షో

పిఠాపురం/గొల్లప్రోలు, మార్చి 5: మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ నెల 7వ తేదీన రోడ్‌షో నిర్వహించనున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. గొల్లప్రోలు నగరపంచాయతీ పరిధిలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా మధ్యాహ్నం 3 గంటలకు, పిఠాపురం మునిసిపాలిటీ అభ్యర్థులకు మద్దతుగా 3.30 గంటలకు ప్రచారం సాగిస్తారని వివరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో రోడ్‌షోలో పాల్గొనాలని కోరారు.

 

Updated Date - 2021-03-06T05:56:59+05:30 IST