ఓ సీఎంను కాల్చమని జగన్‌లా నేనైతే చెప్పలేదు: లోకేష్

ABN , First Publish Date - 2021-06-23T17:51:01+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఓ సీఎంను కాల్చమని జగన్‌లా నేనైతే చెప్పలేదు: లోకేష్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీళ్లు పారే రాయలసీమలో మళ్లీ రక్తం పారటానికి కారణం జగన్ రెడ్డి అని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలండెర్ అని రుజువైందని... 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఓ ముఖ్యమంత్రిని కాల్చమని, చొక్కాపట్టుకోమని, చెప్పుతో కొట్టమని జగన్ రెడ్డిలా తానైతే చెప్పలేదని లోకేష్ అన్నారు.

Updated Date - 2021-06-23T17:51:01+05:30 IST