Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: లోకేష్, వంగలపూడి అనితపై కేసులు నమోదు

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,  తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై  కేసు నమోదు అయ్యింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నరసరావుపేట వెళ్తుండగా  పర్యటనకు అనుమతి లేదని లోకేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో నిన్న విజయవాడలో నాలుగు గంటల పాటు హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement