Lokesh: 19న సీఎం ఇల్లు ముట్టడి

ABN , First Publish Date - 2021-07-17T00:10:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో టీడీపీ నాయకుడు

Lokesh: 19న సీఎం ఇల్లు ముట్టడి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సీఎం ఇంటిని ముట్టడిస్తామని లోకేష్‌ ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని లోకేష్‌ అన్నారు. ప్రభుత్వ వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్ లెస్ క్యాలెండర్ అని లోకేష్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-07-17T00:10:17+05:30 IST