Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని శిక్షించాలి: Lokesh

అమరావతి: వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో అని యెద్దేవా చేశారు.  విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు  దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమన్నారు. వైసీపీ రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని.. చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దని అన్నారు. ‘‘మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి’’ అంటూ లోకేష్ హితవుపలికారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement