Advertisement
Advertisement
Abn logo
Advertisement

మన పాలకులకు గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి: లోకేష్

అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారని...అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నారు.  ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనంద ఆరోగ్యాలతో తులతూగాలని లోకేష్ కోరుకున్నారు. 

Advertisement
Advertisement