Abn logo
Oct 19 2021 @ 14:22PM

Nakka Anand babu ఇంటి వద్ద హైడ్రామా

గుంటూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఆనంద బాబు ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డుతో సంతృప్తి చెందని పోలీసులు... 91 నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ అంతా తిరిగి తనకు ఇస్తే నోటీస్ తీసుకుంటానని ఆనంద్ స్పష్టం చేశారు. అయితే నోటీస్ తీసుకోకపోతే ఇంటి గోడకైనా అంటించి వెళ్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసుల వ్యవహర శైలిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నక్కా ఆనంద్ బాబుకి నోటీస్ ఇవ్వడానికి వచ్చిన సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... నల్గొండ జిల్లా పోలీసులు ఏజెన్సీలో కాల్పులు జరిపారని... అదే రోజు నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశంలో స్మగ్లింగ్ వెనుక నాయకులున్నారని చెప్పారని తెలిపారు. దానికి సంబంధించిన ఆదారాలివ్వాలని అడిగామన్నారు. ఆనంద్ బాబు స్టేట్ మెంట్ రికార్డు చేశామని...ఆధారాలు ఏమీ లేవని చెప్పారని అన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడు లేదా నాయకుడు కచ్చితమైన సమాచారం ఇవ్వాలన్నారు. స్టేట్ మెంట్‌లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. 91 సీఆర్పీసీ కింద నోటీసులిస్తామంటే,  నోటీసులు తీసుకోలేదని చెప్పారు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అంటిస్తామన్నారు. సమగ్రమైన సమాచారం రాకపోవటంతోనే నోటీసులిస్తున్నామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption